పర్యావరణాన్ని పరిరక్షించేదేవరు..

*నూతన విద్యుత్ లైన్ పేరుతో కాంట్రాక్టర్లు అక్రమంగా చెట్టు నరికివేత *నిర్లక్ష్య నీడలో ఆర్ అండ్ బి , పర్యావరణ, విద్యుత్ అధికారులు *హైవే ప్రక్క దశాబ్దాల కాలం నాటి చెట్లు తొలగింపు

సాక్షి డిజిటల్ న్యూస్, కూడేరు మార్చి 14, అనంతపురం జిల్లా ఇన్చార్జ్ అనంతపురం నుండి బళ్లారి జాతీయ రహదారి మీదుగా 33 కెవి నూతన విద్యుత్ లైన్ పేరుతో కూడేరు వరకు దాదాపు 20 కిలోమీటర్ల మేర పర్యావరణాన్ని నాశనం చేస్తూ చెట్లును నరికి వేస్తు కాంట్రాక్టర్లు లైన్ లాగుతున్నారు. కాగా ప్రభుత్వం ఒక ప్రక్క “పచ్చని చెట్టు ప్రగతికి మెట్లు” అంటూ లక్షల లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి పలు సమావేశాలు నిర్వహించి పర్యావరణ దినోత్సవాలను జరుపుతున్నారే తప్పా ఎక్కడ కూడా ఆచరణలో సాధ్యం కావడం లేదని ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్…. లో వోల్టేజ్ పేరుతో కూడేరు వరకు విద్యుత్ లైన్ లాగుతున్న కాంట్రాక్టర్లకు జిల్లా ఉన్నత అధికారులు సహాయ సహకార పుష్కలంగా ఉండడంతో విద్యుత్ కాంట్రాక్టర్లు యదేచ్ఛగా చెట్లను నరుకుతూ పర్యావరణాన్ని దెబ్బ తీస్తు అవినీతి మూటను నెత్తిన కట్టుకుంటు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని మండల వ్యాప్తంగా పలు విమర్శలు వెలవెత్తుతున్నాయి. దాంతో ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న అధికారులు కాంట్రాక్టర్ల చేతిలో కీలుబొమ్మగా మారి అంతో ఇంతో ముట్ట చెప్పుకొని పర్యావరణాన్ని కొంపముంచుతున్న కాంట్రాక్టర్లను సైతం నిలవరించలేకపోతున్నారు. దాంతో పర్యావరణన్ని కాపాడాల్సిన అధికారులే విద్యుత్ కాంట్రాక్టర్లకు చెట్లను నరకడానికి అనుమతులు ఎలా మంజూరు చేస్తారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. నూతన విద్యుత్ లైన్ షాక్కుతో యదేచ్చగా ఆర్ అండ్ బి ప్రక్కనే దశాబ్దాల కాలం నుండి ఉన్నటువంటి చల్లని నీడనిచ్చే పెద్ద పెద్ద పచ్చని చెట్లు సైతం తొలగిస్తూ లైన్ లాగుతున్నారు. ఇంత జరుగుతా ఉన్నా జిల్లా ఉన్నత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ విద్యుత్ కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్నా….. పర్యావరణ అధికారులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో ప్రక ప్రభుత్వ నిబంధనలో ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఏ పని చేపట్టిన ఆ పనికి తగ్గ అమౌంట్ను విద్యుత్ లైన్ టెండర్లను దక్కించుకున్న వారికి నిధులును మంజూరు చేస్తారన్నది జగమెరిగిన సత్యం అయితే ఆ నిధులతో సమాజానికి ఎటువంటి హాని కలిగించకుండా ఒక ప్రత్యేక జీవో ప్రకారం లైను లాగితే ఆ లైన్ ద్వారా నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయాన్ని అందించవలసి వస్తుందని హైవే రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఆర్ అండ్ బి ప్రభుత్వ స్థలంలోనే కాంట్రాక్టర్లు నూతన లైన్లు వేస్తూ అక్రమంగా చెట్లను తొలగిస్తూ పర్యావరణానికి దెబ్బతీస్తున్నారు. ఇంత దారుణంగా పచ్చని చెట్లను తొలగించి పర్యావరణా నికి హాని కలిగిస్తుఉన్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడం, పర్యావరణన్ని రక్షించలేని దౌర్భాగ్య స్థితిలో జిల్లా ఉన్న అధికారులు మిన్నుకుండిపోవడం, చాలా సిగ్గుచేటుగా ఉందని మండల ప్రజలు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *