పరీక్ష కేంద్రాల వద్ద నిషేధ ఆజ్ఞలు అమలు

*గరిడేపల్లి ఎస్సై సలికంటి నరేష్

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14 గరిడేపల్లి ప్రతినిధి బాణోతు రామకృష్ణ, పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద మండలం లో పోలీస్ నిషేధాజ్ఞలు అమలు లో ఉంటాయని గరిడేపల్లి ఎస్సై సలికంటి నరేష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ నెల 14 నుండి ఏప్రిల్ 16 వరకు జరిగే 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజలు గుంపులుగా చేరడంపై నిషేధ ఆజ్ఞలు సెక్షన్ 163 బి.యన్.యస్.యస్ యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అదేవిధంగా ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పెర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని సూచించారు. పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్సై సలికంటి నరేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *