రైతు సంక్షేమమే కూటమి లక్ష్యం

*బిజెపిజిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి 14, వేంపల్లి (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని భాజపా జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ అన్నారు. ఈ మేరకు వేంపల్లి ఒకటవ సచివాలయంలో రైతులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 22వ విడత నిధులు విడుదల చేశారని అన్నారు. దీని వల్ల దేశవ్యాప్తంగా 9.8 కోట్లు పైగా రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ విడత కింద ప్రతి అర్హులైన రైతు కుటుంబానికి ₹2,000 చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడతాయని తెలిపారు. ఈ విడతతో దేశ వ్యాప్తంగా9.8కోట్లకు పైగా రైతు కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి. పీఎం కిసాన్ యోజన ప్రారంభం నుండి ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో 18.640 లక్షల కోట్లకుపైగా నిధులు9.32కోట్లమంది రైతులకు నేరుగా జమ చేయబడ్డాయని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొన్నారు. రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులనే వాడి మన దేశ ఆర్థిక ప్రగతిని పెంపొందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబోయిన రవియాదవ్,రెడ్డయ్య, మహిళా నాయకురాలు పుష్పలత నాయక్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ రెడ్డి వాణి, ఆంజనేయులు నాయక్,శివరంజని హార్టికల్చర్ అసిస్టెంట్ అసిస్టెంట్ మహేష్ నాయక్ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *