సాక్షి డిజిటల్ న్యూస్, మార్చ్:14, కామారెడ్డి జిల్లా ప్రతినిధి పిట్ల .అనిల్ కుమార్ , జిల్లా రవాణా అధికారి
జె. శ్రీనివాస్ ఆదేశాల మేరకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాల్వంచ నందు రోడ్డు భద్రత మరియు మాదకద్రవ్యాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రవాణా శాఖ అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సహాయక మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ (ఏ ఎం వి ఐ ) కె .ఉదయ్ కుమార్ గారు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “ప్రతి ఒక్క విద్యార్థి విధిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలి. నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి” అని సూచించారు. ఉదయ్ గారు మాట్లాడుతు యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
