పంట మార్పు సాగు రైతులకు లాభాదాయకం..

*మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు.

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) జాతీయ ఆహార భద్రతా పధకం లో భాగంగా గార్ల మండలం ముత్తి తండాలో శుక్రవారం ఏర్పాటు చేసిన పెసర పంట క్షేత్ర దినోత్సవం లో మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు మరియు విస్తరణ అధికారి పూజిత పాల్గొని రైతు లకు పంట విధానాల గురించి పంట మార్పిడి గురించి బూసారం పెరుగుదల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గార్ల మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు మాట్లాడుతూ రైతులు క్రమం తప్పకుండా పంట మార్పిడి విధానాలను అవలంభించాలని ఏక పంట విధానం వలన పంటకు సోకిన తెగుళ్ళు పురుగులకు సంబందించిన అవశేషాలు భూమి లో నిల్వ ఉండటం మూలం గా అదే పంట తిరిగి వేయడం ద్వారా పంటలకు చీడ పీడల బెడద ఎక్కువ అవుతుందని కావున రైతులు పంట మార్పిడి విధానం ద్వారా సమస్య ను అధిగమించవచ్చునని రైతులు వరి పంట అనంతరం పెసర వేయడం ద్వారా బూసారం మెరుగు పడుతుందని భూమి గుల్ల బారి నేల నీటి నిల్వ సామర్ధ్యం పెరుగు తుందని నేలకు అవసరం అయిన సూక్స్మ పోషకాలు అందుబాటులోకి రావడం తో పాటుగా పంటకు మేలు చేసే మిత్ర పురుగుల సంతతి వృద్ధి చెందుతుందని రసాయన ఎరువుల వాడకం తగ్గుతుందని రైతు సోదరులకు తెలిపారు రైతులు సాంకేతిక సలహాలు సూచనల కొరకు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *