డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ……..

*ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు


సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 14 భూమయ్య పిట్లం పిట్లం మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి ఆశలు కల్పించి , జుక్కల్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వకుండా మోసం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని నిజంగా అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేసే దిశగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిజంగా ఇల్లు అవసరమైన పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.. రంజాన్ తోఫా అందజేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని.. పేద ముస్లిం కుటుంబాలు రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రంజాన్ తోఫా అందజేస్తున్నారని.. అందులో భాగంగా శుక్రవారం పేద ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రంజాన్ తోఫా పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ ఆవేజ్ బేగ్,ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, జొన్న మోహన్ రెడ్డి, రామ్ రెడ్డి, ఈవో బలరాం, ఎంరోజ్ అధికారులు,, లబ్ధిదారులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *