రైతు భరోసా డబ్బులు వెంటనే వేయాలి

*బిఆర్ఎస్ రైతు విభాగం గ్రామ అధ్యక్షుడు కొమ్ము ఎల్లయ్య


సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14 అచ్చంపేట రిపోర్టర్ (కొమ్ము రేణయ్య) రైతులకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా డబ్బులు వెంటనే విడుదల చేయాలని టిఆర్ఎస్ రైతు విభాగం సిద్దాపూర్ గ్రామ అధ్యక్షులు కొమ్ము ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఖరీఫ్,రబీ సీజన్లో రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం సకాలంలో జమ చేసి ఆదుకునేది అన్నారు.రాష్ట్రంలో అధికారం లోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అలివి లేని హామీలు ఇచ్చి రైతులను మోసం చేసింది అన్నారు. రైతులకు ఎకరానికి 15000 ఇస్తామని, భూమిలేని రైతు కూలీలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక సకాలంలో అందించక రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రబీ సీజన్లో అన్నదాతలు పంటలు పెట్టుబడి కోసం అప్పులు చేసి రబీ,యాసంగి పంటలు వేశారని అన్నారు.రైతు భరోసా డబ్బులు ఎప్పుడు తమ ఖాతాలో పడతాయని చూసి కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం ప్రేమ లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతుల ఖాతాలో రైతుభరోసా డబ్బులను వెంటనే వేయాలని ఆయన కోరారు.లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *