విద్యార్థినీ విద్యార్థులకు జన్నారం మండలంలో వేసవి సెలవులలో

*చిత్రలేఖనం ట్రైనింగ్ క్లాసులను ఐదవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు శిక్షణను అందివ్వాలి

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 14. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్ జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వేసవి సెలవులలో చిత్రలేఖనం పెయింటింగ్ అవగాహన కోసం మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల లోని విద్యార్థులను పంపే విధంగా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ బహుమతులను ప్రోత్సాహక కానుకలను అందియాల్సిన అవసరం మండలంలోని స్థానిక విద్యా వనరుల ఉన్నత అధికారులకు ఉంది అని సామాజిక బాధ్యతగా పలువురు మానవతవాదులు కోరారు వేసవి సెలవులలో ఈత కోసం విద్యార్థులు పలుచోట్ల వెళ్లి ప్రమాదాలకు గురవుతూ కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి ఈతకులను కూడా ఏర్పాటు చేసి ప్రతి వారం ఫైర్ స్టేషన్ సిబ్బందితో ఫారెస్ట్ సిబ్బందితో అవగాహన సదస్సులను కలిగించాల్సిన అవసరం ఉందని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. అనేక ప్రమాదాలు జరగకుండా ఎదుర్కొనే విషయాలను వేసవి సెలవులలో విద్యార్థులకు మండల అధికారులు తెలపాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *