చదువుతోనే విజయ శిఖరాలు… 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపిన బీజేపీ నేత గండిపల్లి రాజు….

*ప్రోత్సాహంగా పెన్నుల పంపిణీ,విద్యార్థుల విజయానికి ఆశీస్సులు… పరీక్షల ముందు ప్రోత్సాహం – గండిపల్లి రాజు

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 14, 2026 మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్: చంద్రశేఖర్ బోడుప్పల్ సర్కిల్ 12వ డివిజన్ పరిధిలోని చెంగిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి పరీక్షల సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గండిపల్లి రాజు విద్యార్థులను కలుసుకుని వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోత్సాహంగా చిరు కానుకగా పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని గండిపల్లి రాజు ఆకాంక్షించారు.భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించి సమాజానికి సేవ చేయాలని విద్యార్థులను ప్రోత్సహించారు.ఈ కార్యక్రమం పాఠశాల ప్రాంగణంలో స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులందరికీ “ఆల్ ది బెస్ట్” అని బోడుప్పల్ సర్కిల్ బీజేపీ సీనియర్ నాయకులు గండిపల్లి రాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *