కమలాపూర్ ను సందర్శించిన జడ్పీ సీఈఓ

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14, 2026. రిపోర్టర్ కిన్నర వేణు, కమలాపూర్ మండలం హనుమకొండ జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి B.శేషాద్రి గారు ఫ్రైడే డ్రైడేలో భాగంగా కమలాపూర్ గ్రామాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. సీఈఓ గారు మొదట మండల పరిషత్ కార్యాలయాన్ని పరిశీలించి ఉపాధి హామీ సిబ్బందితో మండలంలో పని కోరిన కూలీలందరికీ ఉపాధి హామీ పనులు కల్పించాలని, ప్రతి గ్రామంలో కనీసం 100 నుండి 200 మంది వరకు కూలీలకు పని కల్పించాలని కోరడం జరిగింది. ఈ మార్చి నెల మాసంలో కమలాపూర్ మండలానికి నిర్దేశించినటువంటి ఇరవై ఒక్క వెయ్యి పని దినాలు పూర్తి చేయాలని సూచించడం జరిగింది. అనంతరం మార్క మొగిలి గారి గృహ పరిసరాలను పరిశీలించడం జరిగింది.
ఈ గృహావరణలో వివిధ వస్తువులలో నీరు నిల్వ ఉన్న వాటిని ఖాళీ చేయించి, ఎక్కువ కాలం డ్రమ్ములలో టబ్బులలో, గ్రుహ పరిసరాలలో నీరు నిల్వ ఉన్నచో దోమల అధికంగా చేరి, వాటి వలన మనకు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అదేవిధంగా నీరు డ్రమ్ములలో ఎక్కువ రోజులు ఉండటం వలన పాకూరు వచ్చి, అటువంటి నీటిని వాడడం వలన డయేరియా మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్కరూ గృహ పరిసర ప్రాంతాలలో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని, అదేవిధంగా మన ఇంట్లోని చెత్తాచెదారం డ్రైనేజీలలో వేయకుండా చూసుకోవాలని సూచించడం జరిగింది. తదనంతరము ఇందిరమ్మ గృహాలను పరిశీలించడం జరిగింది . ఈ సందర్భంగా ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇందిరమ్మ గృహాలు పూర్తిచేసుకుని ఉగాది లోపు గృహప్రవేశం చేసుకోవాలని, అనుమతి పొందిన లబ్ధిదారులు త్వరగా గృహాలు పూర్తి చేసినచో, రెండో విడతలో కమలాపూర్ మండలానికి ఎక్కువ మొత్తంలో ఇందిరమ్మ గృహాలు లభించే అవకాశం ఉందని తెలియపరచడం జరిగింది . ఈ కార్యక్రమంలో శ్రీయుత మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండె.బాబు గారు, కార్యాలయ సూపరిండెంట్ కరణ్ సింగ్ ,కమలాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పబ్బు సతీష్ గారు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *