సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14 పెనగలూరు రిపోర్టర్ మధు, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనమలూరు మండలం పెనగలూరు పీహెచ్సీలో హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభం – వైద్యుల ఆధ్వర్యంలో అవగాహన అన్నమయ్య జిల్లా పెనగాలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వైద్యాధికారి డాక్టర్ తౌసిఫ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. బాలికలను గర్భాశయ ముఖ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తౌసిఫ్ మాట్లాడుతూ హెచ్పీవీ వైరస్ వల్ల మహిళల్లో గర్భాశయ ముఖ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, చిన్న వయస్సులోనే టీకా వేయించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ తౌసిఫ్ డాక్టర్ శ్రేయ, డాక్టర్ జవహర్ యునాని తదితర వైద్యులు పాల్గొని టీకా ప్రాముఖ్యతపై వివరించారు. ముఖ్యంగా 9 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు ఉచితంగా హెచ్పీవీ టీకా అందజేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు అపోహలు నమ్మకుండా తమ పిల్లలకు తప్పనిసరిగా టీకా వేయించాలని వైద్యులు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని, మహిళల ఆరోగ్య రక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, స్థానిక మహిళలు, బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి అర్హులైన బాలికకు టీకా అందేలా చర్యలు తీసుకుంటామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమం మహిళల ఆరోగ్య భద్రతకు ముఖ్యమైన ముందడుగు అని స్థానికులు అభిప్రాయపడ్డారు.
