డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో 13వ వార్డ్ కౌన్సిలర్

సాక్షి డిజిటల్ న్యూస్ వైరా 14/2026, ఖమ్మం జిల్లా వైరా కాంటెన్సీ ఇంచార్జ్ వైరా మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా 13వ వార్డ్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ మరియు వైరా మున్సిపల్ తొలి వైస్ చైర్మన్ ముళ్ళపాటి విజయ సీతారాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డ్‌లో పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించి, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు నివారించేందుకు ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఇళ్ల వద్ద నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిరియాల శ్రీనివాసరావు, బానోతు విజయ్ అక్కిశెట్టి పూర్ణ ,అక్కశెట్టి నాగు ,మొరం రామ్మూర్తి ,బొడ్డుపల్లి కృష్ణశాస్త్రి, గ్రామ దీపిక దుర్గ భవాని మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *