సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 14 కర్నూలు జిల్లా కౌతాళం మండలం గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని దాట్ల కృష్ణంరాజు ఈరోజు సాయంత్రం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఫోన్లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీయడం జరిగింది. అనంతరం వైసిపి మండల అధ్యక్షుడు ప్రహ్లాద్ ఆచారి , ఎమ్మెల్యే పి.ఏ వెంకటరామిరెడ్డి, కో ఆప్షన్ మెంబర్మాబుసాబ్, కృష్ణంరాజు ఇంటికి వెళ్లి స్వయంగా ఆరోగ్య పరిస్థితులపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాల్ దినకర్ ఉపసర్పంచ్ సక్రి తిక్కయ్య,వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి, లింగారెడ్డి, వడ్డే రాముడు నర్సిరెడ్డి, ఉమాపతి వడ్డే చిన్న హుసేని, వార్డ్ మెంబర్ రామకృష్ణ, వడ్డే అంజి, ఉపేంద్ర, ఎంపీటీసీ ముకన్న,మౌలా, గణపతిరాజు, కుమార్ రాజు, వైసీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు జయపాల్, సోషల్ మీడియా ఖాదర్ లింగ తదితరులు పాల్గొన్నారు.