సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి.14: వేములవాడ ఆర్ సి ఇంచార్జ్: సయ్యద్ షబ్బీర్…తెలంగాణ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు హైదరాబాద్ రాష్ట్రానికి ప్రజల ద్వారా ఎన్నికైన మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 127 వ, జయంతి సందర్భంగా ప్రాథమిక పాఠశాల న్యూ అర్బన్ కాలనీ వేములవాడలో బూర్గుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ” హైదరాబాద్ రాష్ట్ర తొలి ప్రజా ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అని, నిజాం నిరంతశత్వానికి వ్యతిరేకంగా పోరాడి, హైదరాబాద్ రాష్ట్ర విలీనంలో బూర్గుల కీలక పాత్ర పోషించారని, ఆయన భూసంస్కరణలు, విద్యాభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని, తర్వాత కేరళ , ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నరుగా ఆయన పని చేశారని, రామకృష్ణారావు మార్చి 13, 1899న మహబూబ్నగర్ జిల్లా ప్రస్తుత (కల్వకుర్తి ) వాడకల్లు గ్రామంలో జన్మించా రని, పూణేలో బి. ఏ, బొంబాయి విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రం చదివారని, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరిని, నిజాం పాలనకు, రజాకారుల అరాచకాలకు వ్యతిరేకంగా స్వామి రామానంద తీర్థ తో కలిసి పనిచేశారని, 1952లో షాద్ నగర్ నియోజకవర్గం నుండి ఎన్నికై హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ప్రజాస్వామ్య ముఖ్యమంత్రి అయ్యారని, జమీందారీ, ముక్తేదారి వ్యవస్థలను రద్దుచేసి, తెలంగాణలో భూసంస్కరణలు తీసుకువచ్చారని, తెలుగు భాషాభిమానిగా, బహుభాషా వేత్తగా గుర్తింపు పొందారని, 1956 – 60 వరకు కేరళ, 1960 – 62 వరకు ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా సేవలందించారని, అపరచానిక్యుడిగా గుర్తింపు పొందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు గురువు బూర్గుల అని, దేవరకొండలో 1913లో జరిగిన మూడవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారని, స్వతహాగా పండితుడైన బూర్గుల తెలంగాణ ప్రాంతంలో గ్రంధాల యోద్యమంలోనూ క్రియాశీల పాత్ర పోషించారని, స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 1942 లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు నిజాం పోలీసులు ఆయనను అరెస్టు చేశారని, వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమానికి బూర్గుల చట్టబద్ధత కల్పించారని, హైదరాబాదు రాష్ట్రానికి 1952లో మొదటిసారి జరిగిన ఎన్నికల తర్వాత ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, పారశీక వాజ్మయ చరిత్ర బూరుగుల బహు భాషా పాండిత్యానికి నిదర్శనంగా నిలుస్తుందని, ఆంధ్ర విశ్వవిద్యాలయం 1953లో, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యాలయం 1956 లో బూర్గులను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయని” పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దుర్శేటి లక్ష్మీనారాయణ, దాసరి సుజాత, అంగన్వాడి ఉపాధ్యాయురాలు లిక్కిడి మంజుల మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
