కుళ్లిపోయిన ఐస్‌క్రీమ్‌లను పారబోయించిన లింగసాయినిపల్లి గ్రామ యువత

పయనించే సూర్యుడు మార్చి 14 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ : ఈరోజు బిజినపల్లి మండలం లింగసాయనిపల్లి గ్రామంలో ఐస్‌క్రీమ్ అమ్మేందుకు వచ్చిన వ్యక్తి తీసుకొచ్చిన ఐస్‌క్రీమ్‌లు కుళ్లిపోయినట్టు బయటపడింది. ప్రతిరోజులాగే గ్రామానికి వచ్చి ఐస్‌క్రీమ్ అమ్ముతున్న సమయంలో అతను ఎస్సీ కాలనీలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న యువకులు ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసి తెరిచి చూడగా దుర్వాసన రావడంతో అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉన్న వారు మిగతా ఐస్‌క్రీమ్‌లను కూడా పరిశీలించగా అవి కూడా కుళ్లిపోయినట్టే ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఎస్సీ కాలనీలోని యువకులు ఏకమై, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దగ్గర ఉన్న అన్ని ఐస్‌క్రీమ్‌లను పారబోయాలని ఆ విక్రేతకు సూచించారు. ఈ ఘటనతో గ్రామస్తులు అప్రమత్తమై, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఆహార పదార్థాలను కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *