మోటర్ కలెక్షన్ ఇవ్వక నీరు అందక మొక్కలు ఎండిపోతున్నాయి.

*చోద్యం చూస్తున్నారు అధికారులు..6నెలల కాకముందే పాడైన నాశిరకం పైప్లు..

పయనించే సూర్యుడు మార్చి 14, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) మొక్కల పెంపకానికి ఓఎన్‌జిసి విడుదల చేసిన సుమారు 10 లక్షల కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎసఆర్ )నిధులు రెండు శాఖల మద్య రెస్పాన్సిబిలీటీ లేకపోవడంతో మూడ్నాల ముచ్చటగానే ముగిసి చాలా మొక్కలు చనిపోయాయి. ఎన్ని మొక్కలు నాటామని అటవీ శాఖ లెక్కలు వేసుకుని వేళ్శిపోయింది తప్ప ఎందుకు చనిపోయాయో ఇప్పటివరకు కారణాలు చెప్పడంలేదు. ఒక వైపు ఏపిఐఐసి తాము స్థలం చూపించామని, నిధుల సంగతి తమకు తెలియదని చెబుతుంటే మొక్కలు నాటి వెళ్ళి పోయామని, తమకు నిధుల సంఘతి తెలియదని అ{వీ శాఖ అధికారులు చెప్పడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏపిఐఐసి పార్కులో నాటిన మొక్కలకు నీళ్ళు పోసేందుకు బోర్లు, పైప్‌లైన్, ఒక హాప్ హెచ్‌పి మోటారు అమర్చడం జరిగింది. అవి నాసిరకం కావడంతో ప్రస్తుతం అవి శిధిలావస్తకు చేరుకున్నాయి. మరి దీనికి ఎవరు నిధులు మంజూరు చేశారో ఇప్పటికీ తెలియడంలేదు. అధికారుల జేబులో డబ్బులు తీసి ఖర్చు చేసే పరిస్థితి అయితే ఏ మాత్రం లేదు. అయితే ఎవరో ఒకరు దీనికి నిధులు మంజూరు చేసిన దాఖలాలు ఉండాలి. ఇటు ఏపిఐఐసి ఖర్చు చేయకపోయి, అటు అటవీ శాఖ ఖర్చు చేయకపోయి, ఓఎన్‌జిసి నిధులు మంజూరు చేయకపోతే ఈ పరికరాల కొనుగోలుకు, ఆమర్చడానికి, రెండు నెలల నిర్వహణకు ఎవరి జేబులో డబ్బులు ఖర్చు చేసారో చెప్పాల్సిన బాద్యత ఈ రెండు శాఖలపైనే ఉంది. ఇదిలా ఉండగా నీరు రావడానికి 4ఇంచిల రెండు బోర్లను వేయడం జరిగింది. అయితేదీనికి మోటారు కనెక్షన్ ఇవ్వడం మాత్రం మరిచి పోయారు. నీరు మొక్కల దగ్గర పటడానికి గొట్టాలను అమర్చారు. అంతే కాకుండా బిందు సేద్యం చేసే పైపులను కూడా అమర్చడం జరిగింది. అయితే వీటికి ఫోర్స్‌ను అందించి పరికరాలను మాత్రం అమర్చలేదు. మొత్తానికి వాటన్నిటినీ అమర్చడానికి సుమారు లక్షరూపాయలు కూడా ఖర్చు అవ్వదని ఫ్లంబర్స్ చెబుతున్నారు. అయితే మొక్కలు పాతిన మొదట్లో అటవీ శాఖకు చెందిన ఇద్దరు తాళ్ళరేవునుండి వచ్చి నీళ్ళు వేసేవారని, ఆ తర్వాత వారికి జీతాలు ఇవ్వని కారణంగా రావడం మనేసారని స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖనుండి వచ్చారంటే నిర్వహణ బాద్యత వారే కదా తీసుకున్నట్లు. మొత్తానికి ఓఎన్‌జిసి అధికారులే సిఎసఆర్ నిధుల గుట్టు విప్పాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *