విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

పయనించే సూర్యుడు మార్చి 14 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని అక్షర కాన్సెప్ట్ ప్రైవేట్ పాఠశాలలో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. అక్షర కాన్సెప్ట్ పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు చక్కటి విద్యను బోధించి ఉపాధ్యాయులు ఏ విధంగా విద్యను బోధిస్తారో ఆ విధంగా బోధించి విద్యార్థులకు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని విద్యార్థులు తెలియజేశారు. సమాజాన్ని సక్రమమైన దారిలో ఉండాలంటే దానికి కారణం ఉపాధ్యాయులే ఒక టీచర్ ని, డాక్టర్, ఇంజనీయార్లను తయారు చేయాలంటే అది ఒక ఉపాధ్యాయుని వల్లే అవుతుందని సందర్భంగా తెలియజేశారు. స్వపరిపాలన దినోత్సవం భాగంగా కలెక్టర్ గా జ్ఞానేశ్వర్, డీఈవో అద్రిత్ గౌడ్, ఎంఈఓ పింకీ, ప్రిన్సిపాల్ వైష్ణవిగా నిర్వహించారు. స్వపరిపాలన దినోత్సవం భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా మోక్షిత, దీక్షిత వరుణ్ తేజ్ లు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *