చండూరు మండల సర్పంచ్ లకు ముగిసిన శిక్షణా తరగతులు.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 14. తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచ్ ల జనరల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.నల్గొండ లోని డీఆర్ డీఏ కార్యాలయంలో జరిగిన ఈ శిక్షణలో చండూరు మండలానికి చెందిన 19 గ్రామాల సర్పంచు లు పాల్గొని గ్రామాభివృద్ధి మరియు పరిపాలనలో మెళుకువలపై అవగాహన పెంపొందిచుకున్నారు.
చండూరు మండలం లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకు నిర్వహించిన 3 వ విడత శిక్షణా తరగతులు శుక్రవారం తో ముగిసాయి. శిక్షణ ముగించుకున్న సర్పంచ్లకు చండూరు మండల ఎంపీడీవో శాలువాలతో సత్కరించి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. శిక్షణ తరగతుల్లో వివరించిన పలు అంశాల పట్ల సర్పంచు లు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ విధులు, బాధ్యతల గురించి తెలుసుకోవడంతోపాటు  పంచాయతీ నిధుల వినియోగం, ప్రజలకు అందించే సేవలపై అవగాహన కలిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చండూరు మండల సర్పంచ్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *