నారాయణ పాఠశాలలో ఎల్. కే. జి మరియు నర్సరీ విద్యార్థుల నైపుణ్య ప్రదర్శన “

పయనించే సూర్యుడు మార్చ్ 14 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ : ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ జి మ్ రమేష్ కుమార్ మరియు ఉన్నత పాఠశాల ఆర్ న్ డి హెడ్ నరేష్, ఆదోని నారాయణ కళాశాల డీన్ వెంకటేష్ అతిథులుగా విద్యార్థుల తల్లి దండ్రులు విచ్చేసారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి లక్ష్మి రెడ్డి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (ఎస్. ఎల్ సి ) అంటే విద్యార్థి తన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల తో కలిసి తన చదువు, ప్రగతి మరియు సాధనలను స్వయంగా వివరించే సమావేశం ఈ రోజు తో ఎస్ ల్ సి కార్యక్రమం మూడవ రోజు అని అన్నారు ఇందులో విద్యార్థి నాయకత్వం వహిస్తూ, తన క్లాస్‌వర్క్, ప్రాజెక్టులు మరియు అభ్యాస ప్రక్రియను ప్రదర్శిస్తారు, దీని ద్వారా వారి బాధ్యత మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఏ జి మ్ రమేష్ కుమార్ తెలిపారు విద్యార్థి తన పని ప్రదర్శన ద్వారా తానేం నేర్చుకున్నాడో వివరిస్తాడు. విద్యార్థి ప్రెజెంటర్ (నిర్వహకుడు), తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా ఉంటారు. అభ్యాసంలో బాధ్యత, స్వీయ-మూల్యాంకనం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడం. విద్యార్థి తన బలాలు, బలహీనతలను తెలుసుకుని,తదుపరి లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇది సహాయపడుతుంది సాధారణంగా జరిగే పేరెంట్-టీచర్ మీటింగ్ (పి టీ మ్ )లో ఉపాధ్యాయులు మాట్లాడితే, ఎస్ ల్ సి లో విద్యార్థి తన ప్రగతిని తానే పంచుకుంటాడు.ఉపాధ్యాయులు విద్యార్థులతో వారి ఆసక్తులపై చర్చించిన తర్వాత ఒక నిర్దిష్ట సబ్జెక్టును కేటాయిస్తారు. అప్పుడు విద్యార్థులు యూనిట్ నుండి ఒకటి/రెండింటి నుండి నేర్చుకున్న ఒక నిర్దిష్ట భావనను తీసుకొని తల్లిదండ్రులకు వారి అవగాహనను అందిస్తారని ఆర్ న్ డి హెడ్ నరేష్ వివరించారు ప్రెజెంటేషన్ సాధారణంగా చాలా సృజనాత్మకంగా చేయబడుతుంది, ఇందులో చార్ట్/ పీపీ టీ / గేమ్-బేస్డ్/ పజిల్-బేస్డ్/ రోల్-ప్లేలు దోహద పడతాయని కళాశాల డీన్ వెంకటేష్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *