(సాక్షి డిజిటల్ రిపోర్టర్ విగ్నేష్ మార్చ్ 14) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని సూరంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒక రోజు ఉపాధ్యాయులుగా మారి కలెక్టర్ స్థాయి నుండి ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం) వరకు వివిధ హోదాలలో స్వయం పరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులో కృషి చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తమ తల్లిదండ్రులకు మరియు గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాను ప్రకాష్, కరుణ, రేఖ, అటెండర్ రాములు, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని పాఠశాల నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు.