ముగిసిన రెండో విడత వార్డు సభ్యుల శిక్షణ తరగతులు

సాక్షి డిజిటల్ న్యూస్/ మార్చ్ 14 అడ్డగూడూరు రిపోర్టర్ నోముల ఉపేందర్. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిషత్ కార్యాలయంలో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న గ్రామపంచాయతీ వార్డు సభ్యుల రెండో విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీడీవో శంకరయ్య మాట్లాడుతూ.. పంచాయత్ రాజ్ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్ర పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడం, నిధుల వినియోగం,ప్రజా సమస్యల పరిష్కారం,పారిశుధ్య చర్యలు, సంక్షేమ పథకాల అమలు అంశాలపై సభ్యులకు వివరించినట్లు పేర్కొన్నారు. అనంతరం వార్డులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీఓ నవీన్ , మాస్టర్ ట్రైనర్స్, సంబంధిత గ్రామాల ఉపసర్పంచ్ లు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *