పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 14,2026 గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ :ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం రోడ్డులో బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గార్మెంట్స్ యూనిట్‌ను మాజీ పార్లమెంట్ సభ్యురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుకమ్మ ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుకమ్మ మాట్లాడుతూ, ఎమ్మిగనూరు పట్టణంలో గార్మెంట్స్ యూనిట్‌ను ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం అని తెలిపారు. ఈ గార్మెంట్స్ ద్వారా స్థానిక మహిళలకు ఉపాధి లభించి వారి కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని ఆమె అన్నారు.ఇది కేవలం మొదటి అడుగే అని, భవిష్యత్తులో కూడా బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలను చేపట్టేందుకు సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గార్మెంట్స్ యూనిట్ మేనేజర్ ఉషా మేడం, బుట్ట ఫౌండేషన్ అధినేత బుట్ట శివ నీలకంఠ, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ , మధుబాబు,మహిళలు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.