తప్పిపోయిన బాలుడిని తల్లి దగ్గరికి చేర్చిన హెడ్ కానిస్టేబుల్ గంగారం

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టార్ భైరం నారాయణ 14 మార్చి 2026, ఈరోజు తేది 13- 03-2026 సమయం అందాజ11: 00 గంటలకు జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంగణంలో పికెట్ డ్యూటీ విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ గంగారం అనుమానస్పదంగా తిరుగుతూ కనిపించిన బాలుడిని విచారించి బాలుడి యొక్క వివరాలు తెలుసుకునగా వాణి గణేష్, తండ్రి: వాణి సురేష్, వయస్సు 8 సంవత్సరాలు, నివాసం: బేల, అదిలాబాద్ జిల్లా, ప్రస్తుతం కోరుట్లలో వాళ్ళ యొక్క అమ్మ వద్ద ఉంటానని తెలుపగా అతడు తల్లిదండ్రుల వద్ద నుండి తప్పిపోయినాడు అని తెలుసుకొని హెడ్ కానిస్టేబుల్ జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి ఇన్స్పెక్టర్ పి. కరుణాకర్ గారికి అప్పగించగా ఇన్స్పెక్టర్ పి. కరుణాకర్ కోరుట్ల పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇచ్చి వారి ద్వారా సమాచారం వారి యొక్క తల్లిదండ్రులకు చేరవేయగా ఈరోజు బాలుడు యొక్క తల్లి వాణి ముక్తతాయి, భర్త: వాని సురేష్, ప్రస్తుత నివాసం ఆరపేట మెట్పల్లి మండలం అనునామె పోలీస్ స్టేషన్కు రాగా సరైన ఆధారాలు పరిశీలించిన తర్వాత బాలుడిని అప్పగించనైనది. తల్లిదండ్రుల వద్ద నుండి తప్పిపోయిన బాలుడిని గుర్తించి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన హెడ్ కానిస్టేబుల్ గంగారం ను ఇన్స్పెక్టర్ పి. కరుణాకర్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *