మెట్ పల్లి పట్టణంలోని ఉర్దు మీడియం స్కూల్ లో ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు పంపిణీ.

(సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్, మెట్పల్లి మండలం షేక్ అజ్మత్ అలీ) మార్చి 14 2026 త్వరలో ప్రారంభం కానున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని మెట్ పల్లి పట్టణంలో 15వవార్డు చావిడి వద్ద ఉన్నటువంటి జిల్లా పరిషత్ స్కూల్ లో ఉర్దు మీడియం చదువుతున్న 10వ,తరగతి విద్యార్థులకు 15వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అరిగెలఅనూషరాకేష్ సైనిక్ ఫౌండేషన్ తో కలిసి సంయుక్తంగా పెన్నులు మరియు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో భాగంగా సైనిక్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు అరిగెలరాకేష్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ విద్య అనేది నేటి సమాజంలో చాలా అవసరం అని, విద్య వల్ల మనకు సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు.ఈ సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసం కలిగి, ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు. అలాగే రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం విద్యార్థిని, విద్యార్థులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరిగెల రాకేష్ తో పాటు పాఠశాల యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *