సాక్షి.డిజిటల్ న్యూస్ మార్చు. 14. (చౌడపూరు ప్రతినిధి) గ్రామీణ మహిళల అభివృద్ధికి బ్యాంకుల అందిస్తున్న రుణాలను కొందరు పక్కదారు పట్టించి తమ స్వార్థాలకు వాడుకుంటున్నారు మహిళా సంఘాల సభ్యులకే తెలియకుండా వారిపై రుణాలు తీసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న సంఘటన చౌడపూర్ మండలం మరికల్ గ్రామంలో చోటు చేసుకుంది మరికల్ పరిసర గ్రామాలలో ఉన్న మహిళా సంఘాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు సమాచారం మరికల్ స్టేట్ బ్యాంక్ లొ 80 మహిళా సంఘాలలో గ్రూపులో సుమారు1.50 ఒక 50 లక్షలు రూపాయలు మహిళా సంఘాల సభ్యులకు తెలియకుండా వారి సంఘాలపేరు మీద డిపాజిట్ చేయాలని సీసీ లోన్ పేరిట వి.వో శ్రీనివాస్ భారీ మోసాలకు పాల్పడ్డాడు సంఘాలలో కొత్తగా సభ్యురాలు చేర్చుకోవాలంటే ఒక్కొక్కరు సభ్యురాలు దగ్గర వెయ్యి నుండి 2000 రూపాయలు వసూలు చేశారని తెలిపారు మహిళలు కాయ కష్టం చేసి పోగు చేసుకున్న డబ్బులను సకాలంలో చెల్లిస్తాడు అనుకున్న వి.వో ఇలా మోసం చేయడంతో మహిళా సంఘాల సభ్యులుఆందోళన చెందుతున్నారు పై అధికారులు స్పందించి మహిళా సంఘాలకు న్యాయం చేయాలని కోరారు.