రంజాన్ తోఫా కార్యక్రమానికి సీఐ అజయ్ కుమార్‌కు ఆహ్వానం

(సాక్షి డిజిటల్స్) మార్కాపురం జిల్లా, యర్రగొండపాలెం ఆర్ సి ఇంచార్జి రాము : యర్రగొండపాలెం: పట్టణంలో ఈనెల 16వ తేదీన నిర్వహించనున్న “రంజాన్ తోఫా” పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని యర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ (సి ఐ) కె. అజయ్ కుమార్ ని ముస్లిం మైనారిటీ నాయకులు కోరారు. శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్‌లో సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన నియోజకవర్గ టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు, ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ షేక్ ఇస్మాయిల్, ఈ మేరకు ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిరుపేద ముస్లిం సోదరులకు అండగా నిలిచేందుకు ఈ తోఫా కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న సీఐ ఈ కార్యక్రమానికి రావడం తమకు ఎంతో సంతోషమని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *