జగనన్న లేఅవుట్ అక్రమాలపై విచారణ

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 14 రాముకుప్పం రిపోర్టర్ జయరాం రెడ్డి చిత్తూరు జిల్లా, మండల కేంద్రమైన రామకుప్పం లోనున్న జగనన్న లేఔట్ లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై శుక్రవారం తాసిల్దార్ మరియు వామపక్ష నేతల సమక్షంలో విచారణ చేపట్టారు గత వైకాపా ప్రభుత్వంలో పేదల కోసం కేటాయించిన జగనన్న లేఅవుట్ నందు వైకాపా పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా పంపిణీ చేసినట్లు ఆరోపణలు తలెత్తాయిఅదే విధంగా ఓ వ్యక్తి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అర్హులకు అందాల్సిన పట్టాలను విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో పూర్తి విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులను అధికారులను ప్రజలు గొంతెత్తి వేడుకున్నారు ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అర్హులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని తీర్మానిం చారు దీంతో ఎస్సై మరియు తాసిల్దార్ తెలుగుదేశం జనసేన ఇతర పార్టీ నేతలు కలిసి జగనన్న లేఔట్ లో విచారణను చేపట్టారు పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం అర్హులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సూచించినట్లు తెలిసింది అదేవిధంగా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటారని విశ్వసనీయంగాతెలిసింది ఏది ఏమైనా జగనన్న లేఔట్ లో చోటు చేసుకున్న అక్రమాలపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *