సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్, మరికల్, 14, 2026,( రిపోర్టర్ ఇమామ్ ), నారాయణ పేట నియోజక వర్గ శాసనసభ్యురాలు డా: చిట్టెం పర్ణిక రెడ్డి గారి ఆదేశాల మేరకు మరికల్ మండల కేంద్రంలోని స్థానిక 4వ వార్డు లో నివాసం ఉంటున్న ఉమ గారికి ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్. సూర్య మోహన్ రెడ్డి గారి చేతులమీదుగా సీఎం సహాయనిది చెక్కును పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా సూర్య మోహన్ రెడ్డి మాట్లాడుతూ బిద బడుగు బలహీన వర్గాల వారికి ఎప్పుడు కూడా మన ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. అలాగే ప్రజా ప్రభుత్వం అన్నివర్గలవారికి , పార్టీలకు అతీతంగా, అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడం లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మరికల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాటేకొండ ఆంజనేయులు , పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్ , మరికల్ పట్టణ 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పోలేమోని రామకృష్ణ, పెంటమిది రాఘవేందర్, పేరి రామకృష్ణారెడ్డి, తిరుమలయ్య, పి కురుమన్న మేస్త్రి, బోయ రఘు, గూప నరసింహ వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.