ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం

*సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 14 గరిడేపల్లి ప్రతినిధి బాణోతు రామకృష్ణ, గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో అభివృద్ధి ప్రధాత, నీటిపారుదల శాఖ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ₹10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే సీసీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు త్రిపురం అంజన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా త్రిపురం అంజన్ రెడ్డి,సర్పంచ్ చెన్నగాని సాంబయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ సహకరిస్తున్నారని, వెలిదండ గ్రామ అభివృద్ధికి మరిన్ని పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యానాల సోమయ్య, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జంగం కోటేశ్వరావు, వార్డ్ సభ్యులు గండు యల్లయ్య, కమల్ల వెంకటి, కమల్ల శ్రీకాంత్, మరియు యూత్ నాయకులు చెన్నగాని జగన్, బెల్లంకొండ రఘు, మాశెట్టి నర్సింహారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగాల అంజయ్య చారి, వల్లపుదాస్ రాజు, కమల్ల కిరణ్, క్యాసుగాని జానకిరాములు, గండు వెంకటి ,చెన్నగాని నగేష్, కరంగుల వీరయ్య, కమల ధైర్ణప్ప, తూముల బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *