మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు

*పెద్ద తుంబలం వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు మార్చి 14 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ విషయాన్ని వైసీపీ నాయకుడు డి. సూర్పరాజ్ తెలిపారు. మార్చి 12న నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు.పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలపరచాలని డి. సూర్పరాజ్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉచ్చప్ప సర్పంచ్, ఉప సర్పంచ్ తిక్కయ్య, ఎంపీటీసీ శివరాజ్, కె. రామాంజినేయులు, ఎం. నూరి, బి. జిలాని, యువజన నాయకులు డి. కేశవరెడ్డి, కె. హనుమంతు రెడ్డి, పి. మోహన్, డి. రవికుమార్ డి గోవిందు మరియు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *