ఆర్ అండ్ ఆర్ కాలనీలో వాహనాల తనిఖీలు – నాటు సారా రవాణాపై దేవీపట్నం పోలీసుల హెచ్చరిక.

దేవీపట్నం(సాక్షి డిజిటల్ న్యూస్) కె. ప్రకాశ రావు మండల పరిధిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ వద్ద దేవీపట్నం ఎస్‌ఐ కే షరీఫ్ తన పోలీసు బృందంతో కలిసి ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై సంచరిస్తున్న లారీలు, ద్విచక్ర వాహనాలు తదితర వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌ పత్రాలు, భద్రతా నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే నాటు సారా తయారీ, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను తనిఖీ చేసి వివరాలు నమోదు చేసినట్లు తెలిపారు. నాటు సారా అమ్మకం, కాచడం, రవాణా చేయడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు వాహనాలను వినియోగించినా లేదా ప్రోత్సహించినా సంబంధిత వ్యక్తులపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్‌ఐ కే షరీఫ్ స్పష్టం చేశారు. ప్రజలు చట్టాన్ని గౌరవించి పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అప్పారావు, కానిస్టేబుల్ సత్తిబాబు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *