సాక్షి డిజిటల్ రీపోటర్ (చిక్కెల నరేష్ )నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలంలో అయిలాపూర్ గ్రామ సర్పంచ్ మీసాల లక్ష్మీ నారాయణ తన ఉదర స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. విద్యార్థుల ఉన్నతే లక్ష్యంగా వారిని మరింత ప్రోత్సహించే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.తన స్వంత డబ్బులతో గ్రామ ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్ లు, పెన్నులు, స్కేల్ లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గాదె శ్రీనివాస్ మరియు ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు లలాయ్య సార్ , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుగంధ మేడం, వార్డ్ మెంబర్ మేకల సురేష్ ,vdc అధ్యక్షులు వేంకటేశ్వర్ , క్యాషియర్ గంగాధర్ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది..