జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో 36 రోజుల పసికందు మృతి

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చ్ 14 2026 జగిత్యాల జిల్లా, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ నేమూరి కరుణాకర్, మెట్​పల్లి మండలం మారుతి నగర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి (AP 09 CL 8044) నంబర్ గల కారు ఆటో(TG 21 T 0532) ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ​ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో 36 రోజుల పసికందు మృతి చెందింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *