సాక్షి డిజిటల్ న్యూస్, మార్చ్ :4, కామారెడ్డి జిల్లా ప్రతినిధి పిట్ల.అనిల్ కుమార్ భారతదేశ భవిష్యత్తును నిర్మించే మన ఆడబిడ్డల ఆరోగ్యం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) ముప్పు నుంచి బాలికలను రక్షించేందుకు హెచ్ పి వి . టీకా పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యాంశాలు:
ఈ నెల 28న ప్రారంభం. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు. అర్హత: 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలు. లక్ష్యం: తెలంగాణలో 3.30 లక్షల మందికి టీకా పంపిణీ. రాబోయే తరాలను ప్రాణాంతక వ్యాధుల నుండి కాపాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వానికి ధన్యవాదాలు. ‘ఆరోగ్య భారత్’ దిశగా వేస్తున్న ఈ అడుగు ఎంతోమంది ప్రాణాలను కాపాడటమే కాకుండా, ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసానిస్తుంది.