సాక్షి డిజిటల్ న్యూస్, మరికల్, మార్చ్,4, 2026, (రిపోర్టర్ ఇమామ్ ), నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామం లో ప్రభుత్వ మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కావడంతో నీళ్లు వృధాగా పోతున్నాయని కిష్టాపూర్ గ్రామస్తులు వాపోతున్నారు. గత సంవత్సరం నుండి ఈ లీకేజీ కొనసాగుతుందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీలను సరిచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.