సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి 4, అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వర్కర్లని తెల్లవారు జామున అక్రమంగా అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారని మహిళా సంఘం జిల్లా నాయకులు కె.వి సూర్యప్రభ అన్నారు. విజయవాడలో అరెస్టుకు వ్యతిరేకిస్తూ రోలుగుంట మండల కేంద్రంలో నిరసన తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్స్ సమస్యల పై కనీస వేతనాలు కల్పించాలని గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె కాలంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉండి సమ్మె చేస్తున్న అంగనవాడి వర్కర్ దగ్గరకు వచ్చి మీ సంస్థల పరిష్కారం చేస్తానని అన్నారని ఇప్పుడు సంస్థలు పరిష్కారం చేయమంటే అరెస్టులు చేస్తున్నారని అన్నారు. అంగన్వాడీ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు మనీ కృష్ణవేణి అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.