బ్రదర్ టీమ్ ఆధ్వర్యంలో జమ్మికుంట కాలేజీ గ్రౌండ్‌లో హోలీ హంగామా రేన్ డాన్స్, లైవ్ డీజేతో రంగుల సందడి.

సాక్షి డిజిటల్ న్యూస్ జమ్మికుంట టౌన్ రిపోర్టర్, ముందుగా పట్టణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. జమ్మికుంట కాలేజీ గ్రౌండ్‌లో బ్రదర్స్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ ఫెస్టివల్ హంగామా కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు దిలీప్ మరియు జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు యువతకు హోలీ పండుగను ఆనందంగా, కానీ బాధ్యతతో జరుపుకోవాలని సూచించారు.పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుంచి యువతీ యువకులు భారీ సంఖ్యలో సుమారు 700 మంది పాల్గొని రేన్ డాన్స్, లైవ్ డీజే సంగీతంతో రంగుల జల్లుల్లో సందడి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.బ్రదర్స్ టీం నిర్వాహకులు పాల్గొన్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు సమకూర్చడంతో కార్యక్రమం సజావుగా సాగింది. హోలీ పండుగ ఉత్సాహం, ఐక్యత, స్నేహభావాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుక నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *