సాక్షి డిజిటల్ న్యూస్ 3 మార్చి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, జీడి పండించే రైతులకుకార్పొరేషన్ ఎర్పాటు చేయాలని మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కోనుగోలు చేయాలని కేజీ జీడీ పిక్కలకు రెండు వందలు రూపాయలు ఇవ్వాలని ఇతర దేశాల నుండి దిగు మతి అవుతున్న జీపిక్కలను తక్షణమే నిలుపుదల చేయాలని మన జీడి పిక్కలకు అసెంబ్లీలో చర్చించి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం చింతలపూడి సచివాలయం ఎదుట పెద్ద ఎత్తున గిరిజన రైతులు ఆందోళన చేసి వినతి పత్రం సమర్పిం చారు గిరి పుత్రులకు మద్దతుగా వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న గిరిజన సంఘం జిల్లా ఉపాద్యాక్షులు బి టి దొర పల్గోని మాట్లాడారు జీడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్ట పోతు న్నారని తెలిపారు ప్రభుత్వం వరి,చెరకు, పత్తి పామ్ ఆయిల్ మొదలగు పంటలకు మద్దతు ధర ప్రకటి స్తుందని కాని జీడి పంటకు మాత్రం ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించక పోవడం అన్యాయ మన్నారు అసెంబ్లీ సమావేశాల్లో జీడీ మద్దతు ధర మార్కెట్ సౌకర్యం కోసం చర్చించాలని కోరారు.జీడీ పంటకు నిలకడగా ధర ఉండక పోవడంతో జీడి పిక్కల పంట సమయంలో వ్యాపారులు రైతులకు ధర తగ్గించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేసారు వ్యాపారుల చేతికి జీడి పిక్కలు చేరిన తరువాత ఆమాంతంగా జీడి పప్పు ధర పెరుగు పోతుందని అన్నాడు.రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా రాక నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జీడి పిక్కల ధర ప్రభుత్వం శాస్త్రీయంగ నిర్ణయించి అమలు చేయక పోవడంతో వ్యాపారులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.ప్రస్తుతం 80 కేజీల జీడి పిక్కల బస్తాకు వ్యాపారులు రూ. 8,000/-మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో జీడి రైతులు వ్యాపారుల చేతిలో దోపిడీకి గురి అవుతున్నారని తెలిపారు.జీడిపప్పు బస్తా (80 కేజీలు) పిక్కలకు 22 కేజీలు పప్పు వస్తుంది. మరో 3 కేజీలు ముక్కలు, తొక్కలు ఒక బస్తాకు 50 కేజీలు వస్తాయని.దీని ప్రకారం ప్రస్తుత మార్కెట్లో ధరల ప్రకారం సుమారు బస్తాకు రూ. 19,400/- లు ఆదాయం వ్యాపారులకు వస్తుందని తెలిపారు ప్రోసెసింగ్ ఖర్చు బస్తాకు రూ.2,000/-లు, రైతుకు చెల్లించే రూ.16,000/- లు కలిపి మొత్తం రూ.18,000/-లు ఖర్చులకు పోగా ఒక బస్తాకు రూ.1900/- లు వ్యాపారులకు మిగులుతుందన్నారు. మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకొని జీడి రైతులకు న్యాయ మైన ధర చెల్లించి, రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు మన దేశంలో జీడి సాగులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని. అనకాపల్లి జిల్లాలో 90 వేల ఎకరాల్లో జీడి సాగు చేస్తున్నారనీ వేలాది మంది రైతులు గిరిజనులు ధళితులు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. 25 వేల మెట్రిక్ టన్నులు జీడి పిక్కలు ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. నాన్ షేడ్యూల్డ్ గిరిజన, తీర ప్రాంతంలో నీటి వనరులు లేని మెట్ట ప్రాంతంలో జీడి పంట ప్రధాన మైన వాణిజ్య సాగుగా రైతులు పండిస్తున్పారని తెలిపారు జీడి పంట విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టాలని ఇతర దేశాలు నుండి దిగుమతి అవుతున్న జీడీ పిక్కలను వెంటనే నిలుపుదల చేయాలని ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో.జీడి రైతుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి మద్దతు ధర ఇచ్చి కోనుగోలు చేయాలని డిమాండ్ చేసారు జీడికి మద్దతు ధర కోసం జిల్లా వ్యాప్తంగా అందోళను చేస్తామని వారు స్పష్టం చేశారు ఈకార్య క్రమంలోయం ఎర్రునాయుడు జె ఈశ్వరావు దాయిరి ఈశ్వరావు గమ్మేల శ్రీను చిన్నారావు సావు రాము పోయిరి రాము మామిడి ఇరట ఈశ్వరావు పాంగి నరసింగరావుతో పాటు అదిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు