సాక్షి డిజిటల్ న్యూస్, 14 ఫిబ్రవరి, షాద్ నగర్/రిపోర్టర్/కృష్ణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అందరి దృష్టిని ఆకర్షించిన షాద్నగర్ మున్సిపాలిటీ 26వ వార్డు ఫలితం వెలువడింది. ఈ హోరాహోరీ పోరులో బి.ఆర్.ఎస్ (BRS) పార్టీ మద్దతు నిలిపిన అభ్యర్థి బుర్రి శివ ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.
అభివృద్ధికి పట్టం కట్టిన 26వ వార్డు ఓటర్లు. మొదటి నుండి ప్రచారంలో దూసుకుపోయిన బుర్రి శివ, పోలింగ్ రోజున కూడా అదే జోరును ప్రదర్శించారు. స్థానిక సమస్యల పరిష్కారం, వార్డు సర్వతోముఖాభివృద్ధికి శివ గారు చేస్తానన్న వాగ్దానాలకే ప్రజలు మొగ్గు చూపారు. శివ గారి గెలుపుతో వార్డులో పండుగ వాతావరణం నెలకొంది. బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ”ఈ విజయం 26వ వార్డు ప్రజల విజయం. నాపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఓటరుకు రుణపడి ఉంటాను. వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం……..