సాక్షిడిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 14, రాయికల్:జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపాలిటీ ఎన్నికలలో బీజేపీ సత్తా చాటింది. పట్టణం లో 12 స్థానాలు ఉండగా బీజేపీ 5 స్థానాలు, కాంగ్రెస్ 3 స్థానాలు, బీఆర్ఎస్ 3 స్థానాలు, ఒక స్థానం లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.ఈ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మున్సిపల్ ఛైర్మెన్ మోర హన్మాండ్లు బీఆర్ఎస్అభ్యర్థి ఎలిగేటి లతిక చేతిలో… కాంగ్రెస్ నుంచి పోటీచేసిన వైస్ ఛైర్మన్ గండ్ర రామాదేవి స్వతంత్ర అభ్యర్థి బత్తిని మహేశ్వరీ చేతిలో ఓటమి పాలయ్యారు. 1 వార్డు లో తోపారపు ప్రశాంతి ( బీజేపీ), 2 వ వార్డు లో కటకం రవీందర్(బీఆర్ఎస్), 3 వ వార్డు లో భూక్యా రాకేష్ (కాంగ్రెస్)
4.వ వార్డు లో తురుగ సౌజన్య (బీఆర్ఎస్), 5 వ వార్డు లో కునారాపు మానస (బీజేపీ), 6.వ వార్డు వేముల మౌనిక (బీజేపీ) 7.వ వార్డు లో ఎలిగేటి లతికా(బీఆర్ఎస్), 8.వ వార్డు లో పల్లి్కొండ గంగాధర్ (కాంగ్రెస్), 9వ వార్డు లో బత్తిని మహేశ్వరి (స్వతంత్ర) 10.వ వార్డు లో మచ్చ గంగ లక్ష్మి(కాంగ్రెస్), 11.వ వార్డు లో పుర్రె శ్రీధర్(బీజేపీ)
12.వ వార్డు లో కల్లెడ ధర్మపురి(బీజేపీ)అభ్యర్థులు గెలుపొందారు.