సాక్షి డిజిటల్ న్యూస్: 14 ఫిబ్రవరి, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని శుక్రవారం ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు పాటించాలని అధికారులను, సిబ్బందిని ఆయన ఆదేశించారు. గెలుపొందిన అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించడం నిషేధమని ఎస్పీ హెచ్చరించారు.