కళ్యాణపులోవలో ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్

*ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు, దేవాదాయ శాఖ కమిషనర్ సుధారాణి *భక్తులపై దురుసుగా ప్రవర్తించ వద్దని సిబ్బందికి సూచనలు

సాక్షి డిజిటల్ న్యూస్ రావికమతం ఫిబ్రవరి 14 : మండలంలో చీమలపాడు పంచాయతీ కళ్యాణపులోవ పోతురాజు బాబు ఉత్సవాలు కు వచ్చే భక్తులపై దురుసుగా ప్రవర్తించవద్దని అధికారులకు జిల్లా కలెక్టర్ హితవు పలికారు. శుక్రవారం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజుతో పాటు ఆమె ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్తగా నిర్మించిన రింగ్ రోడ్డు, వాహన పార్కింగ్ , భోజనశాల, వంటశాల, భక్తుల విశ్రాంతి షామియానా, ఆలయం వద్ద క్యూ లైన్లు రిజర్వాయర్ వద్ద ఘాట్లు ఎమ్మెల్యే కేఎస్ ఎన్ రాజు స్వయంగా కలెక్టర్ కు చూపించారు. ఉత్సవాల ఏర్పాట్లను స్వయంగా ప్రజా ప్రతినిధి డిజైన్ చేయడం ఇక్కడే చూశానని ఎమ్మెల్యేను కొనియాడారు . అనంతరం అధికారులతో ప్రజా ప్రతినిధులు ఆమె సమావేశం అయ్యారు. ఈ ఉత్సవాలకు తరలి వచ్చే వారిని అతిధులుగా భావించి ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునే ఏర్పాటు చేయాలని కోరారు. త్రాగునీటికి, అన్న ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు చేస్తున్న ప్రజా ప్రతినిధుల బృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన పిలుపుమేరకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న ప్రజా ప్రతినిధుల బృందానికి, అధికారులకు రుణపడి ఉంటారని ఎమ్మెల్యే రాజు అన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు వారికి కేటాయించిన పనులను దగ్గరుండి పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. దర్శనానికి వచ్చే భక్తులను స్నేహ భావంతో చూడాలని సూచించారు. ఎండిఓ మహేష్ మాట్లాడుతూ మండలంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 500 మంది సిబ్బందిని ఉత్సవాలకు నియమించమని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ కే సుధారాణి,విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, మండల టిడిపి పార్టీ అధ్యక్షుడు కోమటి శంకర్రావు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజన్న కొండ నాయుడు, నియోజవర్గ టిడిపి మహిళా కోట నిలవేణి తాసిల్దార్ అంబేద్కర్, కొత్తకోట సిఐ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శేషు రావికమతం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *