ఎంపీపీఎస్ పాఠశాలలను తనిఖీ చేసిన గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి

సాక్షి డిజిటల్ న్యూస్: ఫిబ్రవరి 14 2026, సత్తెనపల్లి మండల రిపోర్టర్: సిహెచ్ విజయ్, గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష చేబ్రోలు మండలంలోని ఎంపీపీ ఎస్ AB నారాకోడూరు పాఠశాలను చేబ్రోలు మండల విద్యాశాఖ అధికారి సుబ్బారావు తో కలిసి తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలలో ని అందరి విద్యార్థుల సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు ప్రతి విద్యార్థి తమ తరగతికి తగ్గట్టుసామర్థ్యాలు కలిగి ఉండాలని అన్నారు అనంతరం ఎంపీపీ ఎస్ ఉర్దూ నదీమ్ పేట, చేబ్రోలు లో గల ఉర్దూ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల చూచిరాత పుస్తకాలు మరియు పుస్తకాలను పరిశీలించి ప్రతి విద్యార్థిని చదివించారు ఉర్దూ భాషకు ఉజ్వల భవిష్యత్తు ఉందని కాబట్టి ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా ఉర్దూ భాష నేర్చుకోవచ్చని అన్నారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యానికి పలు సూచనలు చేశారు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం సంబంధించి నాణ్యతలలో రాజీ పడవద్దని అన్నారుప్రభుత్వం కూడా మంచి బియ్యం సరఫరా చేస్తున్నందువలన పాఠశాలలోని నూరు శాతం విద్యార్థులు భోజనం చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారి తెలియజేశారు అనంతరము చేబ్రోలు లోని అన్నపూర్ణ సత్రంలో గల ఎంపీపీ ఎస్ పాఠశాలను తనిఖీచేసి పాఠశాలలో అమలవుతున్న GFLN ను పరిశీలించి విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము జి ఎఫ్ ఎల్ ఎన్ పూర్తి చేయాలని అన్నారు పాఠశాలలోని ప్రతి విద్యార్థి స్కై సామర్ధ్యాలు కలిగి ఉండే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు చేబ్రోలు మండలంలోని విద్యాశాఖకు చెందిన అన్ని ప్రోగ్రామ్స్ సక్రమంగా అమలు పరచడంతో పాటు అన్ని పాఠశాలలు సమయపాలన పాటిస్తూ హాజరు అమలు పరచడం పట్ల మండల విద్యాశాఖ అధికారి సుబ్బారావును అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *