జర్నలిస్టుల సమస్యల పరిస్కారానికి, చలో విజయవాడ

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ ఎస్ సంజీవ్ అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వంపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ TVసేస్సన్స్ లో వత్తిడి తీసుకొని రావడానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఛలో విజయవాడ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు స్పష్టం చేశారు. శుక్రవారం పాడేరులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు పీ.డీ.చక్రవర్తి, షేక్ రహీమ్ తుల్లా ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి సమాచార శాఖ, కార్మిక శాఖా మంత్రికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దీర్ఘకాలంగా ఆచరణకు నోచుకోని ఇళ్ల స్థలాలు, అర్హులైన వారికి అక్రిడేషన్లు, జర్నలిస్టులకు ఆరోగ్య బీమా, మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం తదితర డిమాండ్స్ తో కార్యక్రమం ఉంటుందని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ఈశ్వరరావు, విశాఖ సిటీ ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ విశాఖ సిటీ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కె.మద దిన్, ఎస్.కె రహీం తుల.తిరునాద్ రామన్న. సన్యాసిరావు.రామ్ నాయుడు.డేవిడ్. సంజీవ్. పాడేరు, అరకు నియోజకవర్గాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *