పి ఆర్ సి ఉద్యోగుల హక్కు-యుటిఎఫ్

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14 పెనగలూరు రిపోర్టర్ మధు, 17 వతేదిన రణభేరి 2. O పేరుతో చలో విజయవాడ కు యుటిఎఫ్ పిలుపు ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి పిఆర్ సి ని ఉద్యోగులకు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నది కానీ పాలకులు విస్మరించి వారి దయా దాక్షిణ్యాలుగా వ్యవహరించడం తగదని యుటిఎఫ్ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు బి. హరి ప్రసాద్, పెనగలూరు మండల అధ్యక్షులు పి. శ్రీనివాస కుమార్ పేర్కొన్నారు. చట్టబద్దంగా పి ఆర్ సి కమీషన్ ను నియమించి వేతనాల సవరణతో పాటు ఉద్యోగుల, పెన్షనర్ల కనీస హక్కుల ను నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రి పై వుంది, కానీ గత ముఖ్యమంత్రి రివర్స్ పి ఆర్ సి ని అమలు చేస్తే ప్రస్తుత ముఖ్య మంత్రి తనకు వదిలిపెట్టాలని కాలయాపన చేస్తున్నారు. కనీసం కమిటీని ఏర్పాటు చేయడం లేదు.ఇప్పటికే 18 నెలల కాలం గడిచింది.అందువల్ల వెంటనే పి ఆర్ సి కమిటీ వేసి 29% మధ్యంతర భృతి మంజూరు చేయాలని కోరుతూ ఈనెల 17 వ తేదీ రణభేరి 2.0 పేరుతో చలో విజయవాడ పోరాటం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగా పెనగలూరు మండలం చక్రంపేట ఉన్నత పాఠశాల నందు పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది. పేరుకుపోయిన బకాయిల చెల్లింపుకు ప్రతినెల కొంత మొత్తం లో నిధుల విడుదల చేయాలని,నాలుగు విడతల పెండింగ్ డిఏలు విడదల చేయాలని, డిఎస్సి 2003 ఉపాధ్యాయ, ఉద్యోగులకు మెమో 57 ను అమలు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని, సిపిఎస్ రద్దు పై కేరళ, తమిళనాడు తరహాలో సానుకూల విధానం తీసుకోవాలని,తెలంగాణ లో వలె హెల్త్ పాలసీ ను అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లేబాకు గోపాల కృష్ణ, యుటిఎఫ్ మండల సహాధ్యక్షురాలు వాణి, మహిళా కన్వీనర్ పద్మశ్రీ,ఆడిట్ కన్వీనర్ సురేంద్ర, జిల్లా కౌన్సిలర్ ప్రసాద్, మహేంద్ర, సుదర్శన్, ఖాదర్ బాష, హసనయ్య, క్రిష్ణ కుమారి, ప్రమీల, శ్రీవాణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *