వెలమపాలెం(కే.జే.పురం )లో శ్రీ సీతారాముల తీర్థం

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వేగి రామారావు అనకాపల్లి, ఫిబ్రవరి 14: అనకాపల్లి జిల్లా కే.కోటపాడు మండలం వెలమపాలెం (కే.జే.పురం) గ్రామంలో శ్రీ సీతారాముల వారి తీర్థ మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే మహిళలు స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది.మధ్యాహ్నం 3 గంటల నుంచి జిల్లాస్థాయి ఎడ్ల పరుగుల పందాలు ఉత్సాహభరితంగా సాగాయి. పందాలను వీక్షించేందుకు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎడ్ల యజమానులు తమ ఎడ్లతో పోటీపడి ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ యడ్ల భారతి రమేష్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *