సాక్షి డిజిటల్ న్యూస్ కురబలకోట ఫిబ్రవరి14 :-(రిపోర్టర్ రామాంజనేయులు) మిట్స్ మదనపల్లి ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు శుక్రవారం మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో ఆధ్వర్యంలో ప్రపంచ రేడియో దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మాట్లాడుతూ ఒకప్పుడు ప్రజలకు వినోదం,విజ్ఞానం కోసం అందరూ రేడియో వినేవాళ్లే నన్నారు. మన యూనివర్సిటీ యాజమాన్యం కమ్యూనిటీ రేడియోను ప్రారంభించడం ద్వారా విద్యార్థులు ఎలక్ట్రానిక్స్,కమ్యూనికేషన్,సిగ్నల్ ప్రాసెసింగ్,ఆడియో టెక్నాలజీ వంటి అంశాలలో ప్రత్యక్ష అనుభవం పొందడంతో వారి సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపరుచుకోవచ్చునన్నారు.సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా రేడియో తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటుందని,ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో ఉపయోగకరమైన సమాచారాన్ని చేరవేయడంలో కమ్యూనిటీ రేడియోలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.అనంతరం ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీలలో విజేతలకు నగదు పురస్కారం మరియు రేడియో లను అందజేశారు.కార్యక్రమంలో మిట్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబెర్ టి.జి రవి కుమార్,ప్రోగ్రామ్ మేనేజర్ నరసింహ చార్లు,ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్,టెక్నికల్ కోఆర్డినేటర్ అరవింద్ రాజ్,స్టేషన్ కో- ఆర్డినేటర్ సతీశ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
