సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వేగి రామారావు అనకాపల్లి ఫిబ్రవరి 14: అనకాపల్లి జిల్లా కే.కోటపాడు మండలం రొంగలి నాయుడుపాలెం గ్రామంలో వెలసిన శ్రీ గంగాల తల్లి పేరంటాలు తీర్థం శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా మహిళలు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో భారీ అన్నసమారాధన చేపట్టారు. గ్రామస్తులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎడ్లపరుగులు, గుర్రపు పందాలు నిర్వహించగా ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భారీ మేళతాళాల నడుమ అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొల్లి ఈశ్వరరావు( భవాని ట్రేడర్స్ గోపాలపట్నం,), పైల నారాయణమూర్తి, కొల్లి గంగునాయుడు, రొంగలి అప్పలనాయుడు (మాజీ సర్పంచ్), కొల్లి నరేష్, జూరెడ్డి దేవుడుబాబు, కొల్లి బాలాజీ, కొల్లి కాశీ విశ్వేశ్వరరావు (చైర్మన్), రొంగలి సూర్యనారాయణ, జూరెడ్డి నరసింహ మూర్తి, బండారు గంగునాయుడు, కొల్లి స్వామినాథం తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.