సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14 భూమయ్య పిట్లం. . . మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఏర్పడిన బిచ్కుంద మున్సిపాలిటీ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తానని పరుమాలు చెప్పిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు విజయ బాటలు పయనించి కైవసం చేసుకున్నారు.శుక్రవారం నాడు వెలువడిన బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 12 వార్డులకు గానూ 10 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు స్వీట్లు పంచుకొని గెలుపు సంబురాలు చేసుకుంటున్నారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ని భారీ పూల మాలతో ఘనంగా సత్కరించారు..ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ..గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుభాకాంక్షలు తెలుపుతూఅభినందించారు..కాంగ్రెస్ పార్టీకి ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన బిచ్కుంద మున్సిపాలిటీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు..ప్రజలు ఇచ్చిన ఈ గెలుపుతో నా భాద్యత రెట్టింపు అయ్యిందని అన్నారు..1వ వార్డులో నిరుపేద కుటుంబానికి చెందిన, సాధారణ కార్యకర్త గోనె గంగారాం గారి భార్య గోనె హన్మవ్వ గెలుపు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.ఈ ఫలితాలు ప్రజా ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతోబిచ్కుంద మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, విద్యుత్ మరియు వీటితో పాటు అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని, ప్రజలకు హామీ ఇచ్చినట్లుగా బిచ్కుందను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని చెప్పారు.. ప్రతీ ఒక్క వార్డును సమగ్రంగా అభివృద్ధి చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ధీమా కనబరిచారు . గెలుపొందిన అభ్యర్థులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ, వార్డు అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
