శివరాత్రికి ఏర్పాట్లు పూర్తి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14 భూమయ్య పిట్లం పిట్లం మండల కేంద్రంలోని రాజరాజేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా భక్తుల కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆలయ కమిటీ సభ్యులు ఎర్ర రమేష్ తెలిపారు..శ్రీ రాజరాజేశ్వర దేవాలయం వద్ద మహాశివరాత్రి ఉత్సవాల కార్యక్రమాలు 14 శనివారం రోజున శివ స్వాముల ఇరుముడి మరియు మధ్యాహ్నం ప్రసాదం వితరణ మరియు 15వ తేదీ ఆదివారం రోజున మహాశివరాత్రి స్వామివారికి అర్చనలు అభిషేకములు, 16 తేదీ సోమవారం రోజున ఉదయము నాలుగు గంటలకు అగ్నిగుండం కలదు. 10 గంటలకు అన్న పూజ ఆకుల పూజ జరుగును మధ్యాహ్నం ఒంటిగంటకు మహాన ప్రసాదం జరుగును. 17 తేదీ మంగళవారం రోజున బద్ది పోచమ్మ వద్ద మధ్యాహ్నము 12 గంటలకు బోనాలు తీయబడును కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆ యొక్క తీర్థప్రసాదములు తీసుకొని వెళ్లగలరని మనవి రాజా రాజేశ్వర ఆలయ కమిటీ సభ్యులు శివ భక్త బృందం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *